సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి
ప్రజలతో నిరంతరం అనుసంధానమై పనిచేయాలి.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ పునాదులని పేర్కొన్నారు.అంకితభావంతో పనిచేసే సాధారణ కార్యకర్తకు పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని, క్షేత్రస్థాయి కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి నాయకులుగా...