సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ దాడి.. రూ.15 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు పట్టుబాటు
రూ.4.50 లక్షల బిల్లు ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు ప్రజాసంక్షేమం న్యూస్ సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రూ.4.50 లక్షల పనుల బిల్లును ప్రాసెస్ చేసేందుకు రూ.15 వేల లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజినీర్ రాజేష్ కుమార్, ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ శివారెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.గణేష్ నిమజ్జనం సందర్భంగా ఊర చెరువు పూడికతీత పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లు ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఫిర్యాదుదారుడి...