సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ మహిళా కన్వీనర్ అనితా శ్రీ

హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్‌ను ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ పెద్దపల్లి జిల్లా మహిళా కన్వీనర్ ఎం. అనితా శ్రీ హైదరాబాద్‌లోని సమాచార హక్కు భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.అనంతరం రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం (RTI) అమలు తీరు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంపై కమిషనర్‌తో చర్చించారు.ముఖ్యంగా ఆర్టీఐ విచారణలకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు (PIOలు)...