PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 2:29 pm Posted by : Praja Sankshemam News

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ప్రజాసంక్షేమం న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆదివారం నాడు నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ చౌరస్తాలో కేక్ కటింగ్ నిర్వహించి అనంతరం బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్న కైలాష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో నిరుపేద, మధ్యతరగతి మరియు మహిళలకు లబ్ధి చేకూరుతుందని పేదరికం లేని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఆయన కృషి చేస్తున్నారని కొనియాడారు. పేదలకు సన్న బియ్యం, సన్న వడ్లు 500 బోనస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, రెండు లక్షల రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం, 90 వేల ఉద్యోగాల భర్తీ, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులు లాంటి కార్యక్రమాలలో దేశానికి ఆదర్శమైన పాలన అందిస్తున్న ఘనత సీఎం రేవంత్ కు దక్కుతుందన్నారు. మంచి ఆరోగ్యంతో మరోసారి తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశ భావం వ్యక్తం చేశారు. కష్టపడిన సీనియర్ కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పదవులు దక్కుతాయని వెల్లడించారు…ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లాపల్లి పరమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బోడ స్వామి,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ,జిల్లా సీనియర్ నాయకులు చింతమల్ల వెంకటయ్య,జిల్లా కార్యదర్శి పగిళ్ల రాజు,చర్లపల్లి గౌతమ్,పళ్ళ రవి తేజ,పులుసు నాగార్జున గౌడ్ ,మాండ్ర శీను,సూర ఆంజనేయులు,గంజి కార్తీక్, పులెంల సందీప్,సచిన్,శరత్,జశ్వంత్, సన్ని అనంత్ సాయి,గోపి,తదితరులు పాల్గొన్నారు….