6,9వ తరగతుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ప్రజా సంక్షేమం న్యూస్:
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6, 9వ తరగతుల ప్రవేశాల కోసం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE-2027) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.అర్హులైన విద్యార్థులు 2026 డిసెంబర్ 3వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్ https://exams.nta.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో 2027 జనవరి 31న ఓఎంఆర్ (OMR) విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
దరఖాస్తు ఫీజు వివరాలు:
– జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850.
– ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700.
ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. సైనిక పాఠశాలల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వివరాలకు: https://exams.nta.nic.in