PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 4:26 pm Posted by : Praja Sankshemam News

హజారిగూడెంలో 19 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

హాలియా,నవంబర్ 18 (ప్రజా సంక్షేమం న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భాగంగా హజారిగూడెం గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో మహిళలు, ఇతర లబ్ధిదారులకు ఈ పత్రాలను అందజేశారు.హజారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 24 మంది చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో 19 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి. మిగిలిన ఐదుగురికి పెన్షన్లు మంజూరు కాలేదు.ఈ సందర్భంగా గుంటక మణికంటరెడ్డి మాట్లాడుతూ.. పెన్షన్ మంజూరు కాని ఐదుగురు దరఖాస్తుదారులు ఎంపీడీఓ కార్యాలయాన్ని సంప్రదించి, తమ దరఖాస్తులు ఏ కారణంతో తిరస్కరణకు గురయ్యాయి, ఏమైనా పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయా అనే విషయాలను పరిశీలించుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా కృషి చేస్తామని తెలిపారు.పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులకు సంక్షేమం అందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు.