హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా.. ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలి: ముఖ్యమంత్రి
చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు.. మరింత విస్తరణకు ఆదేశాలు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై ప్రణాళికలు హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్: హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన, చెత్తరహిత నగరంగా, ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా...