Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణబ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి కి ఘనస్వాగతం :

బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి కి ఘనస్వాగతం :

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్ :
బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సచివాలయంలో సహచర మంత్రివర్గం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు .బ్రిటన్ పర్యటనలో సీఎం గారు ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్ లండన్ వంటి ప్రపంచ స్థాయి యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.హైదరాబాద్‌లో ఆక్స్‌ఫర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రత్యేక రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.వారి చర్చల ఫలితంగా తెలంగాణలో విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారం అందించేందుకు కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్ సంస్థలు అంగీకరించాయి.రాష్ట్ర విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు, మన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు వారు చేస్తున్న కృషి ఎంతో గొప్పది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.