ప్రజాసంక్షేమం న్యూస్ :
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గీత దాటిన వారిపై వెంటనే వేటు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందని తెలిపారు.అలాగే క్యాబినెట్‌లో ప్రభుత్వంలో మార్పులు రావాలని,కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు తగ్గించాలని,పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమనితెలిపారు.పెన్షన్లు రూ.4,000కి పెంచాలని,రైతు భరోసా కొనసాగించాలని,22Aను రద్దు చేయాలి,ఉచితాలు తగ్గించాలని,ఉద్యమకారులకు న్యాయం చేయాలని తెలిపారు.క్యాడర్‌లో అసంతృప్తిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని ఇవన్నీ చేస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తాము అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

