ప్రజాసంక్షేమం న్యూస్:
బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక వైఖరి,శాసనసభ గౌరవ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు, మహిళా పోలీసుల పట్ల దురుసు ప్రవర్తనపై ఎర్రవల్లిలో దళితులు నడిచిన బాటలను పాలు,పసుపు నీళ్లతో శుద్ధి పేరిట కడిగి అంటరానితనాన్ని ఆచరించడం వంటి దుశ్చర్యలకు పాల్పడిన వారితో పాటు వెనుక ఉన్న కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారిని కలిసి కాంగ్రెస్ శాసనసభ,శాసనమండలి సభ్యులతో కలిసి వినతిపత్రం సమర్పించటం జరిగిందని ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు తెలియజేసారు .బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక వైఖరిని ప్రజాస్వామిక తెలంగాణ ఎప్పటికీ క్షమించదు.

