Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనల్గొండలో పారిశుద్ధ్యానికి కొత్త ఊపు.. 3 డ్రైన్ క్లీనింగ్ మిషన్లు ప్రారంభం

నల్గొండలో పారిశుద్ధ్యానికి కొత్త ఊపు.. 3 డ్రైన్ క్లీనింగ్ మిషన్లు ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఆధునిక యంత్రాలతో డ్రైనేజీ సమస్యలకు వేగంగా పరిష్కారం
పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపడే అవకాశం
మూడు నూతన వాహనాలను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ:నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచేందుకు నూతనంగా కొనుగోలు చేసిన మూడు డ్రైన్ క్లీనింగ్ మిషన్ వాహనాలను మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో డ్రైనేజీ సమస్యల పరిష్కారం,మురుగునీటి కాలువల శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణను మరింత వేగవంతంగా చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కలెక్టర్ చంద్రశేఖర్,పలువురు కార్పొరేటర్లు,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.