Saturday, November 14, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుఅయ్యప్ప మాల ధరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

అయ్యప్ప మాల ధరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మునుగోడు, నవంబర్ 14 (ప్రజా సంక్షేమం న్యూస్):మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొలిసారిగా అయ్యప్ప స్వామి మాల ధరించారు. శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు చండూరు మండల కేంద్రంలోని నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు అయ్యప్ప మాలధారణ చేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.