ప్రజా సంక్షేమం న్యూస్ – నల్గొండ
నల్గొండ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ (DSP) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రూ. 14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది విద్యార్థులు, ముఖ్యంగా బిసి, ఎస్సీ, ఎస్టీ మరియు పేద వర్గాలకు చెందిన విద్యార్థులు కళాశాలల్లో తమ చదువులను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిల ఆలస్యం కారణంగా విద్యార్థుల చదువులకు ఆటంకం కలగడమే కాకుండా, దాదాపు ఒక కోటి కుటుంబాలపై ఈ ప్రభావం పడిందని నాయకులు పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్లు:
ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ. 14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి, విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకునేలా చర్యలు తీసుకోవాలి.కళాశాలల్లో ప్రభుత్వం చెల్లించే ఫీజులతో నిమిత్తం లేకుండా, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు వెంటనే అందజేసేలా ప్రభుత్వం ఒక జీఓ (GO) ని జారీ చేయాలి.ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు మామిడి జగన్, రడంపల్లి వంశీ, కిన్నెర రవికుమార్, ఇరిగి సుధాకర్, దుర్గం శేఖర్, యాతకుల సైదులు, ఒంటెపాక వినోద్, శ్రవణ్, గిరి, సూర్య, చిలుముల నాగరాజు, సైదులు తదితరులు పాల్గొన్నారు.

