ప్రజాసంక్షేమం న్యూస్
అసెంబ్లీ లాబీలో ఈరోజు ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ శ్రీ మధు యాష్కీ గౌడ్ గారిని పొన్నం ప్రభాకర్ గారూ కలిశారూ.ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా నియమితులైన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారూ. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారూ.దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల నిపుణులను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేయడంలో, వారి ఆలోచనలు, సూచనలు పార్టీ విధాన రూపకల్పనలో భాగస్వామ్యం అయ్యేలా చేయడంలో మధు యాష్కీ గౌడ్ గారు కీలక పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నారూ.నూతన బాధ్యతల్లో ఆయనకు ఘన విజయం లభించాలని, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు.

