ప్రజాసంక్షేమం న్యూస్ :
తెలంగాణలో ప్రతీ టర్మ్ లో ఓ మంత్రి బర్తరఫ్ జరుగుతుంది. తాజాగా తెలంగాణ రాజకీయంలో సంచలణంగా మారిన రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగిస్తూ (బర్తరఫ్ చేస్తూ) గవర్నర్ భవన్ నుండి అధికారికంగా తెలపడంతో రాష్టంలో ఇదివరకు జరిగిన పరిణామాలు గుర్తుచేసుకుంటరున్నారు. 2015లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను ఆనాడు సీఎం కేసీఆర్ ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేశారు. అదేవిధంగా 2021లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను కూడా నాటకీయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేశారు.2026లో ఇప్పుడు మంత్రిగా ఉన్న కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేశారు. ఇందులో ఇద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కాగా,ఈటల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు.

