Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణచలనచిత్ర రంగంలో పద్మశ్రీ షావుకారు జానకి లేని లోటు పూడ్చలేనిదీ: ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి

చలనచిత్ర రంగంలో పద్మశ్రీ షావుకారు జానకి లేని లోటు పూడ్చలేనిదీ: ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమ న్యూస్ – హైదరాబాద్
ప్రముఖ నటి,పద్మశ్రీ షావుకారు జానకి గారు మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్‌ను ప్రారంభించిన షావుకారు జానకి గారు దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని అన్నారు.‘షావుకారు’సినిమాలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడ్డారని గుర్తుచేస్తూ,తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లోనే కాకుండా హిందీ,మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారని అన్నారు.పలు మేటి చిత్రాల్లో షావుకారు జానకి పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు.చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. భగవంతుడు ఆమెకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ,అమె కుటుంబ సభ్యులకు,అభిమానులకు ముఖ్యమంత్రి గారు సంతాపాన్ని,ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.