Monday, August 24, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఆటో కార్మిక సంఘాల తో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు సఫలం:

ఆటో కార్మిక సంఘాల తో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు సఫలం:

📰 Generate e-Paper Clip

ఆటో కార్మిక సంఘాల డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది:
ప్రజా సంక్షేమం న్యూస్
ఆటో కార్మిక సంఘాల నిరవధిక బంద్ విరమించుకోవాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి కి స్పందించి సమ్మె విరమించిన ఆటో కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ఆటో కార్మిక సంఘాల కు ప్రభుత్వం నుండి సానుకూల అంశాలు ఆర్టీసీ పక్షాన ఈవి ఆటో లు కొనే ప్రసక్తే లేదు ఆది దుష్ప్రచారం మాత్రమే ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది విధివిధానాలకు సెప్టెంబర్ 1 వ తేదీ కార్మిక శాఖ & రవాణా శాఖ & ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం.2012 తర్వాత ఆటో చార్జీలు పెంచలేదు కాబట్టి ఆటో చార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ ఎంత పెంచాలి అనే దానిపై తగిన నివేదిక తీసుకొని సంబంధిత జీవో విడుదల చేయడానికి అంగీకారం.ఓలా, ఉబెర్ లా మాదిరి ప్రభుత్వం తరుపున యాప్ చేయాలని నిర్ణయం ప్రభుత్వం ఐటీ శాఖ నుండి యాప్ ప్రారంభించేందుకు తగిన ప్రక్రియ ప్రారంభిస్తాం.ద్విచక్ర వాహనాల్లో రాపిడో,ఓలా ఉబెర్ నడిపే వాటికి ఎల్లో ప్లేట్ ఉన్న వాటికి మాత్రమే ప్రయాణికులను తరలింపు పై నిర్ణయం తీసుకుంటాం.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు 12 వేల రూపాయల అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తగిన అంశాలు పరిగణన లోకి తీసుకొని ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి,సహచ మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటాం.హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో పాత డీజిల్,పెట్రోల్ ఆటో లకు రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటో లుగా మార్చడానికి 1.50 లక్షలు ప్రభుత్వం సహాయం అందిస్తుంది కొత్త ఆటో లు కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి పర్యావరణాన్ని కాపాడడానికి నగరంలో ఈవి ఆటో లుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆటో కార్మికుల సోదరులు వారి డిమాండ్స్ పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉంది.ఆటో కార్మిక సంఘాలతో చర్చలు జరిపినా రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి , జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్,జెటిసి లు చంద్రశేఖర్ గౌడ్,శివ లింగయ్య,వెంకట రమణ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.