(ప్రజాసంక్షేమం న్యూస్-మునుగోడు):
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఆర్టియు (PRTU) రాష్ట్ర నాయకత్వం, గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో పిలుపునిచ్చిన సెప్టెంబర్ 01 (Spt 01, 2026) మహాధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిఆర్టియు మునుగోడు మండల అధ్యక్షులు యూసఫ్ పాషా గారు, ప్రధాన కార్యదర్శి గొడ్డటి నరసింహ గారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉపాధ్యాయుల హక్కులు, డిమాండ్ల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. పాఠశాలలకు ఇబ్బంది కలగకుండా ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఉండి ,మిగతా ఉపాధ్యాయులందరూ 1 సిఎల్ (CL) పెట్టి, స్వంత ఖర్చులతో ఈ మహాధర్నాకు తరలిరావాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనకు ఇది తొలిమెట్టు అని, వాట్సాప్‌లలో పోస్టులు పెట్టడానికే పరిమితం కాకుండా ప్రత్యక్ష పోరాటంలో మన బలాన్ని ప్రదర్శించాలన్నారు.
ముఖ్యమైన డిమాండ్లు:
ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ (CPS) రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలి.
* 2003 డిఎస్సీ (DSC) ఉపాధ్యాయులకు తక్షణమే OPS వర్తింపజేయాలి.
* 51% ఫిట్మెంట్తో పిఆర్సి (PRC) ప్రకటించాలి.
* ఉపాధ్యాయులకు రావలసిన పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
* సమగ్ర శిక్షా (SSA/KGBV) ఉద్యోగులకు టైమ్ స్కేల్ మంజూరు చేయాలి.
* గురుకుల ఉపాధ్యాయుల పనివేళల (టైమ్ టేబుల్) మార్పు మరియు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలి.
మండలంలోని ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో హాజరై, ఈ మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఉపాధ్యాయ శక్తిని చాటిచెప్పాలని అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

