Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకుట్ర ప్రకారమే గౌరవ స్పీకర్‌ను అవమానించే ప్రయత్నాలు: ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

కుట్ర ప్రకారమే గౌరవ స్పీకర్‌ను అవమానించే ప్రయత్నాలు: ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్:
శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నేడు యావత్ తెలంగాణ సమాజంతో పాటు ముఖ్యంగా దళిత సమాజం బాధతో అసెంబ్లీ వైపు చూస్తోందని అన్నారు.గత పది సంవత్సరాల పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.గతంలో శ్రీ భట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఆయనను అవమానించారని గుర్తు చేశారు.ప్రస్తుతం ఒక కుట్ర ప్రకారమే గౌరవ స్పీకర్‌ను అవమానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.జగదీష్ రెడ్డి నుంచి తాతా మధు వరకు పలువురు నాయకులు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వైఖరి అద్ధంపడుతుందని అన్నారు.దళిత వ్యతిరేక పార్టీగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు.స్పీకర్‌పై చేస్తున్న దుర్భాషలు చూస్తుంటే మనసు కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.