Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణవారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు బీఏసీ నిర్ణయం:

వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు బీఏసీ నిర్ణయం:

📰 Generate e-Paper Clip

తెలంగాణ శాసనసభ,శాసనమండలి బీఏసీ సమావేశాలు!
వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు బీఏసీ నిర్ణయం!
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు ఆమోదం!
సమావేశాల పొడిగింపుపై మరోసారి భేటీ కానున్న అసెంబ్లీ బీఏసీ..
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర వర్షాకాల సమావేశాల నేపథ్యంలో శాసనసభ,శాసనమండలి సమావేశాల నిర్వహణ,సభా కార్యక్రమాలు,చర్చించాల్సిన అంశాలు,ఎజెండాపై చర్చించేందుకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశాలు జరిగాయి.
శాసనసభ బీఏసీ సమావేశం:తెలంగాణ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరిగింది.ఈ సమావేశంలో శాసనసభ సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.సభలో చర్చించాల్సిన అంశాలు,సమావేశాల నిర్వహణ,ఎజెండాపై సభ్యులు చర్చించారు.అవసరాన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు బీఏసీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై శాసనసభలో చర్చించేందుకు బీఏసీ ఆమోదం తెలిపింది.శాసనసభ సమావేశాల్లో 25 అంశాలపై చర్చించాలని బీజేపీ నేతలు కోరారు.అలాగే 22ఏ అంశంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని బీజేపీ పట్టుబట్టింది.
శాసనమండలి బీఏసీ సమావేశం:తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో శాసనమండలి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరిగింది.శాసనమండలి సమావేశాల నిర్వహణ,సభా కార్యక్రమాలు,సభలో చర్చించాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం,ఎఫ్‌ఎండీ,శ్రీపాల్ రెడ్డి,శాసనమండలి సెక్రటరీ డా.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.