ప్రజా సంక్షేమం న్యూస్:
తెలంగాణ సమాజంలో హక్కుల పోరాటానికి, స్త్రీ చైతన్యానికి నిలువెత్తు రూపం వీరనారి చాకలి ఐలమ్మ అని చరణ్య శ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు ప్రెసిడెంట్ దోమలపల్లి గోపి కొనియాడారు.వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చరణ్య శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి,పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చరణ్య శ్రీ ఫౌండేషన్ ఫౌండర్ &ప్రెసిడెంట్ దోమలపల్లి గోపి మాట్లాడుతూ..అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన ధైర్యం,ప్రతి మహిళకు స్ఫూర్తిగా నిలిచిన మహానీయురాలు చాకలి ఐలమ్మ.భూమి,భుక్తి,వెట్టిచాకిరీ ముక్తి కోసం ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకం.ఆమె చూపిన బాటలో నడుస్తూ,సమాజంలో వెనుకబడిన వర్గాలకు, మహిళలకు అండగా నిలవడమే ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం.ఈ కార్యక్రమంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ ప్రతినిధులు మరియు టీమ్ సభ్యులు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల సంక్షేమం మరియు సామాజిక చైతన్యం కోసం ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.

