ప్రజాసంక్షేమం న్యూస్
ప్రవాస తెలుగు బిడ్డల ఆకాంక్షలు మరియు వారి హక్కుల కోసం ఎన్ఆర్ఐల సమస్యలు, పెట్టుబడుల అంశాలను సభ దృష్టికి తీసుకెళ్లడము జరిగింది .రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుతం ఉన్న సింగిల్ విండో విధానాన్ని మరింత సులభతరం చేయాలని.ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం కీలకం. ప్రభుత్వం మరియు విదేశాల్లో ఉన్న ప్రవాసుల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక ‘ఎన్ఆర్ఐ కమిషన్’ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దుబాయ్, ఖతార్ గల్ఫ్ కార్మికులతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ ప్రవాసులకు ఇందులో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.మాతృభూమిపై ప్రేమతో ఎన్ఆర్ఐలు ఇక్కడ కొనుగోలు చేసిన ఆస్తులు, స్థలాలకు సంపూర్ణ భద్రత కల్పించాలి.అమాయక ప్రవాసులు లేని సమయంలో వారి స్థలాలను, ఇళ్లను ల్యాండ్ గ్రాబర్లు అక్రమంగా ఆక్రమిస్తున్నారు.
భూకబ్జాదారుల బారిన పడకుండా ప్రవాసుల ఆస్తుల రక్షణకు పటిష్టమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు .ప్రవాసులు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ఈ ప్రత్యేక వేదిక ఎంతగానో ఉపకరిస్తుంది.ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్న ప్రవాస తెలంగాణ బిడ్డలకు సంపూర్ణ భరోసా ఇవ్వడమే మన ప్రధాన లక్ష్యం. రాష్ట్ర సమగ్ర ప్రగతిలో భాగస్వాములయ్యే ప్రవాస సోదరులకు మన ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటుంది.విదేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణ బిడ్డల సంక్షేమం మరియు హక్కుల సాధన కోసం మన ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది.ప్రవాస సోదరులకు న్యాయం జరిగే వరకు సభ లోపల, వెలుపల నా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.అధ్యక్షా, విదేశాల్లో ఉన్న మన ఉద్యోగస్తులు, నిపుణులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు.భారత ప్రభుత్వానికి మనం నివేదించాల్సింది ఏందంటే, ఇలాంటి ప్రోగ్రెసివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి.వాటిని అడ్డుకోవడం లేదా రాజకీయ ప్రమేయం ఉండడం చాలా ఇబ్బందికరమైన పరిణామం.
పెద్దల సభ ద్వారా ఇలాంటి ఇంటలెక్చువల్ ఇష్యూస్‌ను, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సౌత్ లో ఎడ్యుకేషన్ మీద చేసిన స్టడీని లేవనెత్తడాం జరిగింధి.సౌత్ లో ఎడ్యుకేషన్ ఎంపావర్మెంట్ మీద మంచి అవకాశాలు రాకుండా పోయిన అంశాన్ని సభలో స్పష్టం చేశాను.బీజేపీ మిత్రులు లేదా భారత ప్రభుత్వం తరఫున ఎవరైనా, ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు, ప్రైవేట్ కార్యక్రమాలకు ఈజీగా పర్మిషన్ ఇస్తున్నారు.అంతర్జాతీయంగా తెలంగాణ ఖ్యాతిని పెంచుకోవాలంటే ఎన్ఆర్ఐల విలువైన సలహాలు, సూచనలు విధిగా తీసుకోవాలి. ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే విదేశాలతో ‘షేరింగ్ ది థాట్స్’ ప్రక్రియ చాలా ఈజీ అయిపోతుంది.ఈ కమిషన్‌కు ముఖ్యమంత్రి గారు చీఫ్ పాట్రన్‌గా ఉంటూ, ఒక ఎన్ఆర్ఐని చైర్మన్‌గా చేసి విదేశాల నుంచి డైరెక్టర్లను నియమించాలి.మన వాళ్ళలో స్టార్టప్‌లు నడుపుతున్న యువతతో సమావేశాలు ఏర్పాటు చేస్తే భారీగా పెట్టుబడులు మన రాష్ట్రానికే వస్తాయి.గుజరాత్‌లో మోదీ గారు చేసినట్లుగా, గుజరాతీ వాళ్ళందరినీ పిలిచి వ్యాపారంలో భాగస్వామ్యం చేసినట్లే మనం కూడా చేయాలి.మన రాష్ట్రం నుంచి దాదాపు 15 నుండి 20 లక్షల మంది విదేశాల్లో ఉంటే, అందులో 10 నుండి 15% మంది పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఉన్నారు.విదేశాల్లో ఉన్న మన వాళ్ళ ఐడెంటిటీని, హక్కులను పరిరక్షించే పూర్తి బాధ్యత మన ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నా.

