ప్రజాసంక్షేమం న్యూస్
ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే రూ.5 లక్షలు సరిపోవట్లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీలో గళం విప్పారు.ఇందిరమ్మ ఇల్లు కట్టే మేస్త్రిలే రూ.3-4 లక్షలు తీసుకుంటున్నారని మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగిపోయిందని ఇప్పుడు ఇల్లు కట్టాలంటే రూ.10-15 లక్షలు అవసరం పడుతున్నాయని చాలా మంది ఇల్లు వచ్చినా డబ్బులు లేక మొదలు పెట్టలేదని కొంతమంది డబ్బులు సరిపోక బంగారం కుదవపెట్టి మొదలుపెట్టారని కాబట్టి గౌరవ మంత్రిగారు ఇట్టి విషయం పై ప్రభుత్య పెద్దలతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల బడ్జెట్ను పెంచాలని కోరడం జరిగింది.

