Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనల్గొండలో ప్రశాంతంగా ముగిసిన అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్‌–2 పరీక్ష

నల్గొండలో ప్రశాంతంగా ముగిసిన అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్‌–2 పరీక్ష

📰 Generate e-Paper Clip

**ఉదయం 122 మంది, మధ్యాహ్నం 117 మంది అభ్యర్థుల హాజరు**
**ప్రజా సంక్షేమం న్యూస్ | నల్గొండ**

నల్గొండ జిల్లా కేంద్రంలోని నేతాజీ నగర్‌ ఎస్పీఆర్‌ పాఠశాలలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్‌–2 పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ తెలిపారు.జిల్లాలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ఉదయం నిర్వహించిన పరీక్షకు 185 మందికి గాను 122 మంది, మధ్యాహ్నం పరీక్షకు 117 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు.పరీక్ష ప్రారంభమైన వెంటనే కలెక్టర్‌ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం ఇన్‌చార్జి, జిల్లా పరిశ్రమల మేనేజర్‌ సతీష్‌ను అభ్యర్థుల హాజరు, ఇతర ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.జిల్లా అధికారుల సమన్వయంతో పరీక్షను పకడ్బందీగా నిర్వహించామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష ప్రశాంతంగా ముగియడంపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.