తెలంగాణ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి ఆదాయానికి గండి కొట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని మండిపడ్డారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.54 కోట్ల బకాయిలు పెట్టిందని, సింగరేణి నష్టాలకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్సే కారణమని అన్నారు.

