Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeక్రైమ్ఎర్రగట్టుతండాలో వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదంలో ముగ్గురు అరెస్టు:

ఎర్రగట్టుతండాలో వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదంలో ముగ్గురు అరెస్టు:

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్ – సూర్యాపేట
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టుతండాలో వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదంలో ముగ్గురు అరెస్టు చేసిన పోలీసులు..ఈ ఘటనకు సంబంధించి మేళ్లచెరువు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రెస్ నోట్‌ రిలీజ్..క్రైం నంబర్ 170/2026 కింద BNS సెక్షన్లు 333, 103(1), 61(2) రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో ఎర్రగట్టుతండా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిందితులు పరస్పర వివాదం నేపథ్యంలో బాధితులపై దాడికి పాల్పడినట్లు పోలీసుల వెల్లడి..అరెస్టైన నిందితుల్లో భూక్యా పెద్ద బాబు, భూక్యా రాము, భూక్యా లక్ష్మి అనే ముగ్గురు అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసాము..వెంకటేశ్వర్లును హత్య చేసేందుకు లక్ష్మి తన కొడుకులకు సపోర్ట్ చేసింది.తండ్రి భూక్యా సైదా వెంకటేశ్వర్ల ను చంపినారని కొడుకులు ను మందలించినందుకు నువ్వు వెంకటేశ్వర్లు కు సపోర్ట్ చేస్తున్నావని ఇద్దరు కొడుకులు సైదా ను కూడా చంపినారు..ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.