Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకొడంగల్ నుంచి కర్ణాటకకు తెలంగాణ రేషన్ బియ్యం అక్రమ తరలింపు!

కొడంగల్ నుంచి కర్ణాటకకు తెలంగాణ రేషన్ బియ్యం అక్రమ తరలింపు!

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్
కొడంగల్ నుంచి కర్ణాటకకు తెలంగాణ రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరుగుతుంది.కేవలం వికారాబాద్ జిల్లాలోనే ప్రతీ నెల రూ.10 కోట్ల సన్న బియ్యం అక్రమ దందా చేస్తున్నారు.తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో అక్రమాలకు తెర లేపుతున్న దుండగులు ప్రతీ కుటుంబానికి దాదాపు 50 నుంచి 100 కేజీల సన్న బియ్యం రావడంతో, వాటిని ఒక్కో కేజీ రూ.10 నుంచి రూ.12కే దళారులు కొనుగోలు చేస్తున్నారు .గ్రామాల్లో ఉదయమంతా తిరిగి బియ్యం సేకరించి, రాత్రికి రాత్రే కొడంగల్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్న వైనం చూస్తున్నా ఎవ్వరు పట్టించుకునే వారే లేరు.రూ.10కి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి, కర్ణాటకలోని గుర్మిట్కల్ మార్కెట్లో ఒక్కో కేజీ బియ్యం రూ.40కి విక్రయిస్తున్న అక్రమార్కులు కేవలం వికారాబాద్ జిల్లాలోనే దాదాపు 50% రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ రూ.10 కోట్ల దందాకు తెరలేపుతున్నట్లు సమాచారం గుల్బర్గా, గుర్మిట్కల్ ప్రాంతాలు కొడంగల్‌కు ఆనుకుని ఉండడంతో, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో అక్రమంగా సేకరించే సన్న బియ్యం దందా అంతా దగ్గరుండి నడిపిస్తున్న కొడంగల్ వ్యాపారులు రాజకీయ అండదండలతో అధికారులను మేనేజ్ చేస్తూ విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్న దళారులు కొడంగల్ నుంచి గుల్బర్గా వెళ్లి దారిలో ఉన్న కస్తూర్‌పల్లి చెక్‌పోస్ట్, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మేడక్ చెక్‌పోస్ట్ ఎత్తివేయడంతో సాఫీగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.