
ప్రజా సంక్షేమం న్యూస్-హాలియా
రోజువారి పారిశుద్ధ్య పర్యవేక్షణలో భాగంగా హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి గారు పర్యవేక్షణ చేసి హాలియాలోనీ మున్సిపాలిటీలోని 7 వ వార్డు లో ఉన్న డ్రైనేజీల వెంట ఉన్న పిచ్చి మొక్కలు మరియు చెత్తాచెదారం ను శానిటేషన్ సిబ్బందితో పరిసరాలను పరిశుభ్రం చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి చెత్త ఆటోలు వస్తున్నాయి మీ ఇంట్లో వెలువడే చెత్తను చెత్త ఆటోలో తడి చెత్త, పొడి చెత్త, వేరుచేసి ఆటోలో వేయగలరు.ఇంటి యజమానులు ఎవరైనా మీ ఇండ్ల లలో వెలువడే వ్యర్థ పదార్థాలను డ్రైనేజీలో వేయకండి.వాటిని డ్రైనేజీలో వేయడం వలన దోమలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.అలా వేయడం వలన మనం అనారోగ్యం బారిన పడతాం.మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని తెలియజేశారు.

