Saturday, September 12, 2026
prajasamkshemam news
HomeUncategorizedపెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పాదయాత్రను జయప్రదం చేయండి

పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పాదయాత్రను జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

– సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు పిలుపు
– పాదయాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ప్రజా సంక్షేమం న్యూస్ తేదీ: 26-08-2026
జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, కాలువల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో దాసరి పాండు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారంలోకి రాకముందు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, కాలువలను పూర్తి చేసి రైతులకు సాగు, త్రాగునీరు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, నేటికీ ఆ పనులను పూర్తి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు.
ఆత్మకూరు కాలువ సమస్య ఆత్మకూరు మండలంలో ఏళ్ల తరబడి పునాదిగాని కాలువ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయని, సిపిఎం పోరాటాలు చేసినప్పుడల్లా అరకొర నిధులు విదిల్చి పనులు జరుగుతున్నట్లు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.
బడ్జెట్ కేటాయించాలి:
ప్రభుత్వం చిత్తశుద్ధితో తగిన బడ్జెట్ కేటాయించి, రైతుల సంక్షేమం దృష్ట్యా పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈనెల 29, 30, 31 తేదీల్లో జిల్లాలో జరిగే పాదయాత్రతో పాటు, ఆగస్టు 31న హైదరాబాదులో నిర్వహించే భారీ బహిరంగ సభను రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం, సీనియర్ నాయకులు రచ్చ గోవర్ధన్, మండల నాయకులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి, మల్లెల శ్రీశైలం, వెంకటరెడ్డి, నరసింహ, కేశవులు, సత్తయ్య, రాములు, యాదయ్య, రాజు, ఎల్లయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.