Saturday, August 22, 2026
prajasamkshemam news
HomeUncategorizedస్ఫూర్తి దాత అన్వర్ అమీర్అలీఫౌండేషన్ అవార్డుకు ఎంపిక

స్ఫూర్తి దాత అన్వర్ అమీర్అలీఫౌండేషన్ అవార్డుకు ఎంపిక

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్-హలియా
సమాజ సేవలో నిరంతరం ముందుండుతూ పేద, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం హలియా మున్సిపాలిటీ వాస్తవ్యులు షేక్ అన్వర్‌ గారిని అమీర్అలీ ఫౌండేషన్ అవార్డుకు ఎంపిక చేశారు1999లో విద్యార్థి సంఘం ద్వారా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించిన అన్వర్‌.. 2005 నుంచి వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.గత 21 సంవత్సరాలుగా వీధి వ్యాపారులకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.అలాగే నిరుపేద ఆడపిల్ల వివాహాలకు తన స్నేహితులతో కలిసి ఆర్థిక సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు.కరోనా సమయంలోనూ తన వంతుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలిచారు.వేసవికాలంలో చలివేంద్రాలు, రక్తదాన శిబిరాలు అమీర్అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ తన వంతు సహాయం అందించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమీర్అలీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్అలీ మాట్లాడుతూ సేవా రంగంలో యువతను ప్రోత్సహిస్తూ, స్వయంగా రక్తదానం చేయడంతో పాటు రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న అన్వర్‌గారిని సత్కరించి సేవలను అభినందించారు. ఆయన సేవలను గుర్తించి అమీరుల ఫౌండేషన్ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా షేక్ అన్వర్‌ గారు మాట్లాడుతూ.. “తల్లిదండ్రులు నేర్పిన విలువలతో నా పరిధి మేరకు సమాజ సేవ చేయడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది” అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.