ప్రజాసంక్షేమం న్యూస్
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి ఘటనలో కేటీఆర్ పీఆర్వో, పీఏపై కేసు నమోదుచేశారు .పోలీసుల విధులకు ఆటంకంకలిగించారని ఆర్ఐ జంగయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై BNS 132, 352, 351(2), r/w 3(5) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చెసారు .ఇదే ఘటనలో ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మరో 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ నాయకులపై కేసులు చేసినవిషయం తెలిసిందే ! అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

