Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణగ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత:MLA శ్రీ కుంభం అనిల్ కుమార్...

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత:MLA శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మల్లెపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి!
ప్రజాసంక్షేమం న్యూస్-వలిగొండ

వలిగొండ మండలం మల్లేపల్లి గ్రామంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.రూ.40 లక్షల నిధులతో నిర్మించిన డ్రైన్ రూ.10 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు పనులు పూర్తికావడంతో వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.అదేవిధంగా రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా శక్తి భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ భీమా నాయక్,PACS చైర్మన్ గరిసే రవి, స్థానిక సర్పంచ్ కుంభం వెంకటపాపి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని సహాదేవ్ గౌడ్, ఉప సర్పంచ్ మలుగ మాధవి–వెంకటేష్, pacs వైస్ చైర్మన్, డైరెక్టర్స్, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.