Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణతెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి:

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి:

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్-నల్గొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో ఉన్నటువంటి రజక భవన్ దగ్గర వీరనారి చాకలి ఐలమ్మ గారి 41వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమె యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు తెలంగాణ రజక (దోబీ )అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసంభూస్వామి పెత్తందారులకు ఎదురు నిలబడి పోరాటం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారుఅని అన్నారు ఆమెను ఆదర్శంగా తీసుకొని నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ మన బీసీ రిజర్వేషన్ల కోసం హక్కుల కోసం పాటుపడాలని అని అన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలను విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ముందుకెళ్లకుండా ఆధిపత్య పార్టీలు బీసీలనువెనుక బాటు చేస్తున్నారని అని అన్నారు ఇకనైనా బీసీ లందరూ మేల్కొని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో 2028వ సంవత్సరములో మన బీసీ పార్టీలో నిలబడి నటువంటి అభ్యర్థులకే ఓట్లు వేసుకొని బీసీ రాజ్యాధికారం తీసుకురావాలని పిలుపునిచ్చినారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం వెంకట మధుగారు బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్ గారు రజక అభివృద్ధి సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిమర్రి శ్రీనివాస్ గారు జిల్లా కార్యదర్శి పగిళ్ల ఎంకన్న గారు రజక మహిళ నాయకురాలు రేవెల్లి సునీత గారు రజక సంఘం నాయకులు పగిళ్ల పెద్ద వెంకన్న గారు యలిజాల అంజయ్య గారు ఎల్లుట్ల రవి గారు జిల్లా పెళ్లి నరసింహ గారు గడ్డం మారయ్య గారు బీమనపల్లి శంకరయ్య గారు చర్లపల్లి మల్లేశం గారు వట్టికోటి రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.