ప్రజాసంక్షేమం -న్యూస్
లోక్ సభ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ లో హల్ద్వాని పట్టణంలోని కోట్వాలీ పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు పెట్టిన అక్రమ కేసులపై దేశ వ్యాప్తంగా ఎఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో నల్ల రిబ్బన్ ధరించి వారి నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖర్జున ఖర్గే గారు ప్రసంగించిన స్థలాన్ని శుద్ధిపేరుతో బీజేపీ – ఆర్ఎస్ఎస్ లాంటి మతోన్మాద మనువాద సంకుచిత భావాలను పేరేపిస్తున్నామని ,ఇది దేశ సమానత్వానికి వ్యతిరేకం అన్నారు.కుల-మత విభేదాల ద్వారా దేశంలో అలజడి సృష్టించి దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ – ఆర్ఎస్ఎస్ పై కేసులు నమోదు చేయకుండా రాహుల్ గాంధీ గారి పై కుట్ర పూరితంగా కేసులు పెట్టడం బీజేపీ అరాచకానికి నిదర్శనమన్నారు.దేశంలో యువత మోడీ పోవాలి రాహుల్ రావాలి అంటున్నారని 2029 లో రాహుల్ గాంధీ దేశప్రజల కోరిక మేరకు ప్రధాని అవుతారని అన్నారు.
KCR రాజీనామా చేయాలని నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత డిమాండ్!
గత 3 సంవత్సరాలుగా ఏ నాడు శాసనసభకు ప్రజల మధ్యకు రాని నేతగా ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ BRS LP (ప్రతి పక్ష నేత)కి రాజీనామా చేయాలని నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత డిమాండ్ చేశారు . కోటి 24 లక్షల 40000 వేల రూపాయల జీతం తీసుకుని 22 కోట్ల రూపాయల సౌకర్యాలు పొంది ఇప్పటివరకు శాసనసభకు రాకుండా ముఖం చాటేస్తున్న కెసిఆర్ రాజీనామా చేయాలని,లేకుంటే తెలంగాణ ప్రజలు క్షమించారన్నారు. వెయ్యి రోజుల రేవంత్ రెడ్డి ప్రజా పాలన కేసీఆర్ కంటే 100 రెట్లు మేలు అని పేర్కొన్నారు. సన్న బియ్యం,సన్న వడ్లకు, 500 బోనస్,ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ క్యాంటీన్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు,200 యూనిట్ల ఉచిత విద్యుత,500 రూపాయలకు గ్యాస్ సిలిండర్,82 వేల ప్రభుత్వ ఉద్యోగాలు,2 లక్షల రుణ మాఫీ,ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు,నూతన హ్యాంరోడ్స్ లాంటి పథకాలతో తెలంగాణ దేశంలో నంబర్ వన్ లో ఉందని అలాంటి రేవంత్ రెడ్డి సర్కార్ 2వ సారి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిగ్గు లేకుండా బిఆర్ ఎస్ నిరసన చేపట్టడం శోచనీయం అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లాపల్లి పరమేష్,మహిళా జిల్లా అధ్యక్షురాలు గోపగని మాధవి,INTUC జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య,శాలిగౌరారం మండల అధ్యక్షుడు చింత ధనుంజయ్,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ,జిల్లా ప్రధాన కార్యదర్శులు పోసిరెడ్డి సంతోష్ రెడ్డి,మేకల రాజేందర్ రెడ్డి,ఏళ్ల రవీందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి పగిళ్ల రాజు, స్వరూప రెడ్డి,సుజాత,చింతమల్ల వెంకయ్య,మధు ప్రసాద్, కాటం వెంకన్న,మిట్టపల్లి నాగరాజ్,వేముల గోపీనాథ్, బాలం మహేష్, వావిళ్ళ దేవదాస్, ఎండి అజీజ్,సూర ఆంజనేయులు,ఇందనూరి శ్రీను,సీతారామ్,చింతల సతీష్,బాలకృష్ణ,కత్తుల గణేష్,గంజి మనోజ్, అకటి సైదులు,రాంబాబు,సురేందర్, చందు,గంజి వేణు,కోరే శివ,చిలకమర్రి శివ,రావులపాటి నాగరాజు,గుండు సంపత్,బెత్తంగి అశోక్,జమ్మూ అశోక్,వడ్లకొండ పరమేష్, సచిన్, వినీత్,శరత్ తదితరులు పాల్గొన్నారు…

