Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణరేవంత్ రెడ్డిపై అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు!

రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు!

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్:
సీఎం రేవంత్ రెడ్డి తనను అడుగడుగునా అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి కొండా సురేఖ లేఖలు రాశారు.ఆగస్టు 22న సోనియాగాంధీకి,కేసీ వేణుగోపాల్‌కు, ఆగస్టు 23న మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ,ప్రియాంకా గాంధీ,మీనాక్షి నటరాజన్‌కు లేఖలు పంపినట్లు వెల్లడించారు. కొండా సురేఖ ఆరోపణలు:రాజకీయంగా,పరిపాలనాపరంగా తనను మొదటి నుంచే సీఎం అణచివేస్తున్నారని ఆరోపణ చేశారు.తన శాఖల్లో నిర్ణయాధికారాన్ని తగ్గించి సీఎంవో నేరుగా ఆదేశాలు ఇస్తోందని యాదాద్రి దేవస్థానం ట్రస్టు బోర్డు ఏర్పాటుపై తనకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు,
సమ్మక్క-సారలమ్మ దేవాలయ అభివృద్ధి నిధులను తనకు తెలియకుండా R&B శాఖకు బదిలీ చేశారూ తన మాజీ OSD సుమంత్‌ను తనకు తెలియకుండా తొలగించి, అరెస్టు కోసం పోలీసులను తన ఇంటికి పంపారు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో వివక్ష చూపారూ కడియం శ్రీహరి తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారని ఆరోపణ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేతలను తనకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి ఇబ్బందులు పెట్టారని ఆరోపణ తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చారని విమర్శ.ఇతరులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోకుండా తనను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ .బీసీ మహిళా మంత్రిని కావడం వల్లే తనపై కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్య తన ఆరోపణలకు సంబంధించిన వీడియోలు,ఇతర ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను లేఖలకు జత చేసినట్లు కొండా సురేఖ తెలిపారు.అయితే ఆసక్తికర పరిణామం ఆగస్టు 22న రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలతో అధిష్టానానికి లేఖలు రాసిన కొండా సురేఖ.ఆగస్టు 28న సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి బంగారు రాఖీ కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.లేఖల్లో ఆరోపణలు ఒకవైపు.ఆ తర్వాత రాఖీ కట్టిన పరిణామం మరోవైపు!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.