Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

📰 Generate e-Paper Clip


హైదరాబాద్‌లోని గోషామహల్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హుసేన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, మెట్టు సాయి కుమార్ తదితర అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి నమూనా డిజైన్లను పరిశీలించడంతో పాటు నిర్మాణ ప్రాంతంలోని వివిధ బ్లాక్‌ల పనుల పురోగతిని సమీక్షించారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటివరకు ఎంత మేర పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.నిర్ణీత గడువుతో పోలిస్తే కొన్ని పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, నిర్మాణంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును సుమారు రూ.2,700 కోట్ల వ్యయంతో, 2,000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. భవిష్యత్ తరాలకు ఆధునిక వైద్య సేవలు అందించేలా అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.