Wednesday, November 11, 2026
prajasamkshemam news
HomeతెలంగాణNHM ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి!

NHM ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి!

📰 Generate e-Paper Clip

వారి డిమాండ్లు న్యాయమైనవి..ప్రభుత్వం తక్షణమే స్పందించాలి:డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్,అక్టోబర్ 24(ప్రజా సంక్షేమం న్యూస్):
నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వికారాబాద్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న NHM ఉద్యోగులకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను,డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు.NHM ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని,ప్రభుత్వం వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని కోరారు.ముఖ్యంగా ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను చేపట్టడం ద్వారా వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారికి న్యాయం చేయాలని డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.