Saturday, August 22, 2026
prajasamkshemam news
HomeUncategorizedమేమే హార్ముజ్‌ సంరక్షకులం.... భయపెడుతున్న ట్రంప్ కొత్త రూల్

మేమే హార్ముజ్‌ సంరక్షకులం…. భయపెడుతున్న ట్రంప్ కొత్త రూల్

📰 Generate e-Paper Clip

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనికి తోడూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధిపై ప్రకటించిన 20 శాతం టోల్ పన్ను ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో డొనాల్డ్ ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుండటంతో ఆ మార్గాన్ని రక్షించే బాధ్యతను అమెరికా తీసుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ రక్షణ కోసం 20 శాతం టోల్ చెల్లించాలని స్పష్టం చేశారు. అమెరికా ఇకపై హార్ముజ్ జలసంధికి సంరక్షకురాలిగా వ్యవహరిస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రటించారు. ఆ మార్గం గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌకలోని సరుకు విలువపై 20 శాతం పన్ను చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఆ వసూళ్లను అక్కడ భద్రతా ఖర్చుల కోసం ఉపయోగిస్తామన్నారు.ఇప్పుడు ప్రశ్న భారత్ కూడా ఈ హార్ముజ్ పన్నును చెల్లించాల్సి వస్తుందా, ఒకవేళ చెల్లిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది

భారత్‌కు పెరగనున్న ఇబ్బందులు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ సంచలన ప్రకటన.. భారత్‌తో పాటు ముడిచమురు దిగుమతులపై ఆధారపడిన అనేక దేశాలకు గణనీయమైన సమస్యలకు కలిగించవచ్చు. దేశంలో మొత్తం ముడి చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులే కావడం గమనార్హం. ఈ దిగుమతులలో ఎక్కువ భాగం ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. ఇది భారతీయ రిఫైనరీలకు చేరడానికి హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తాయి. ఇండియా మొత్తం ముడి చమురు దిగుమతులలో సుమారు 40 శాతం, ఎల్ఎన్జీ రవాణాలో 60 శాతం, ఎల్పీజీ దిగుమతులలో 90 శాతం హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతాయి. హార్ముజ్ జలసంధిలో క్షీణిస్తున్న పరిస్థితి ఇప్పటికే చమురు రవాణా వ్యయాన్ని పెంచుతోంది. డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ టోల్ ఈ ఆందోళనలను మరింత పెంచుతుంది. ఇండియాకు ఈ 20 శాతం టోల్ పన్ను ఇంధన దిగుమతి వ్యయాలను పెంచుతుంది. ఇది రిఫైనరీలు, షిప్పింగ్ కంపెనీలు, బీమా సంస్థలపై ఒత్తిడిని పెంచుతుంది. దీని తదుపరి ప్రభావం ఏమిటంటే.. పెరిగిన రవాణా, బీమా ఖర్చులు దేశ ఇంధన దిగుమతి బిల్లుపై ఒత్తిడిని పెంచుతాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నాలను క్లిష్టతరం చేయవచ్చు.

మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు డొనాల్డ్ ట్రంప్ పన్ను దుష్ప్రభావాలు ఇంతటితో పరిమితం కాలేదు. పెరుగుతున్న దిగుమతుల బిల్లు ఇండియా వాణిజ్య సమతుల్యతపై కూడా ఒత్తిడిని కలిగించవచ్చు. చమురు దిగుమతుల బిల్లు పెరగడం వల్ల దేశ కరెంట్ ఖాతా లోటు పెరుగుతుంది. దీని వల్ల డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. చమురు, గ్యాస్ దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారితే.. ఈ పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణానికి కూడా ఆజ్యం పోస్తాయి. రవాణా కూడా ఖరీదైనదిగా మారితే, నిత్యావసర వస్తువులు, సేవలు మరింత ఖరీదైనవిగా మారతాయి. ఇంధనంపై ఎక్కువగా ఆధారపడిన పరిశ్రమలు పెరిగిన నిర్వహణ ఖర్చులను ఎదుర్కోవచ్చు. హార్ముజ్ జలసంధి వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం ఎక్కువ కాలం చమురు సంబంధిత సమస్యగా మిగిలిపోదు.

అది త్వరలోనే ద్రవ్యోల్బణం, వాణిజ్యం, ఆర్థిక వృద్ధికి సంబంధించిన విషయంగా మారుతుంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరగవచ్చు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, జూన్‌లో భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల తర్వాత ఆర్బీఐ 4% స్వల్పకాలిక లక్ష్యాన్ని అధిగమించింది. గతంలో కంటే సన్నద్ధంగా ఉన్న భారత్ 20 శాతం హోర్ముజ్ పన్ను ఇండియా పైనా, చమురు దిగుమతులపై ఆధారపడిన ఇతర దేశాలపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నది స్పషమవుతోంది.

అయినప్పటికీ మధ్యప్రాచ్య సంక్షోభానికి ఈసారి భారత్ గతంలో కంటే ఎక్కువగా సన్నద్ధంగా ఉంది. కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడటాన్ని తగ్గించుకుని, భారత్ తన దిగుమతులను పెంచుకుంది. రష్యాతో సహా ఇతర దేశాల నుంచి కొనుగోళ్లను పెంచింది. వీటిలో అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్, గయానా, వెనిజులా ఉన్నాయి. అంతేకాకుండా, దేశీయ గ్యాస్, చమురు ఉత్పత్తిని కూడా పెంచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.