Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణసివిల్ జడ్జి నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు:

సివిల్ జడ్జి నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు:

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్
సివిల్ జడ్జి నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: 3 ఏళ్ల ప్రాక్టీస్ నిబంధన 1 సంవత్సరానికి తగ్గింపు.సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో విధించిన 3 సంవత్సరాల న్యాయవాద ప్రాక్టీస్ నిబంధనను 1 సంవత్సరానికి కుదిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. యువ న్యాయవాదులు, మహిళా అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 31 మార్చి 2027 వరకు వచ్చే నోటిఫికేషన్లలో ఎలాంటి ముందస్తు ప్రాక్టీస్ అనుభవం లేకుండానే లా గ్రాడ్యుయేట్లు పరీక్ష రాయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
అయితే, ఎంపికైన అభ్యర్థులు నేరుగా కాకుండా ‘ట్రైనీ జ్యుడీషియల్ ఆఫీసర్లు’గా చేరుతారు. వీరు 1 సంవత్సరం పాటు జ్యుడీషియల్ అకాడమీలో శిక్షణ, మరో 1 సంవత్సరం పాటు లా క్లర్క్‌షిప్ (6 నెలలు జిల్లా కోర్టు, 6 నెలలు హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో) పూర్తి చేయాల్సి ఉంటుంది.1 ఏప్రిల్ 2027 తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు మాత్రం కనీసం 1 సంవత్సరం యాక్టివ్ ప్రాక్టీస్ తప్పనిసరి. ఈ రెండేళ్ల శిక్షణ సమయంలో అభ్యర్థులకు
JMFC జీతంలో 50% స్టైపెండ్‌గా అందుతుంది. హైకోర్టు జడ్జి ఇచ్చే సంతృప్తికరమైన నివేదిక ఆధారంగానే వారికి రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.