నల్గొండ ప్రతినిధి ప్రజా సంక్షేమం న్యూస్:
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వేగంగా,నాణ్యమైన యూనిఫారాలు అందించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.విద్యార్థుల కొలతలు తీసుకోవడం నుంచి కుట్టింపు,నాణ్యత పరిశీలన,పాఠశాలలకు పంపిణీ చేసే వరకు ప్రతీ దశను అధికారులు,సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో పంపిణీ వివరాలు..
జిల్లాలోని 55 రెసిడెన్షియల్ ( టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్, టిజిటిడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజెపిటిబిసి డబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీఎంఆర్ఈఐఎస్, కేజీబీవీ ) పాఠశాలలకు చెందిన 22,189 మంది విద్యార్థులకు (6,346 మంది బాలురు, 15,843 మంది బాలికలు) యూనిఫారాలు అందించాల్సి ఉంది.అయితే కేజీబీవీ విద్యార్థులకు 2 జతల బట్ట రాగా, కుట్టింపు పూర్తి చేసి పాఠశాలలకు పంపిణీ చేశారు.
మిగిలిన రెసిడెన్షియల్ పాఠశాలలకు ఒక జత బట్ట రాగా, దానిని కుట్టి పంపిణీ చేశారు. 2వ జతను సెప్టెంబర్ 15 లోపు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సాధారణ ప్రభుత్వ పాఠశాలల పురోగతి..
జిల్లాలోని 1,045 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 51,739 మంది విద్యార్థులకు (27,022 మంది బాలురు, 24,717 మంది బాలికలు) యూనిఫారాలు కుట్టించాల్సి ఉండగా ప్రస్తుత వివరాలు ఇలా ఉన్నాయి.వచ్చిన క్లాత్: 48,795 మంది విద్యార్థులకు 35,909 జతలు కుట్టింపు పూర్తయినవి,30,432 జతలు యూనిఫారాలు పంపిణీ చేశారు.మిగిలిన కుట్టింపు, పంపిణీ ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు.ప్రత్యేక ఆల్టరేషన్ సౌకర్యం అండ్ ఎస్ హెచ్జి ఉపాధి విద్యార్థులకు దుస్తులు సరిగ్గా సరిపోయేలా ప్రతి పాఠశాలలో ‘ఆల్టరేషన్స్’ చేయడానికి ఒక ఎస్ హెచ్ జి మహిళా టైలర్‌ను అందుబాటులో ఉంచారు.ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సరైన కొలతలతో నాణ్యమైన దుస్తులు అందడమే కాకుండా, గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతోంది. ప్రతి జత యూనిఫాం కుట్టినందుకు గాను ఎస్ హెచ్ జి టైలర్లకు రూ. 75 చెల్లిస్తున్నారు. మొత్తం 1,69,510 యూనిఫారాల కుట్టింపు ద్వారా జిల్లాలోని 658 మంది ఎస్ హెచ్ జి మహిళా టైలర్లకు రూ. 1,27,13,250 ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఇందుకు సంబంధించిన నిధులు ఇప్పటికే జిల్లాకు విడుదలయ్యాయని డిఆర్డిఏ అధికారులు స్పష్టం చేశారు.

