విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసి వేధిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు
ప్రజా సంక్షేమం న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న 10800 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, స్కాలర్షిప్ తో సంబంధం లేకుండా సర్టిఫికెట్ ఇవ్వాలని, జీవో నెంబర్ 7, 8, 9 రద్దుచేసి, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం రోజున భూదాన్ పోచంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జూనియర్ కాలేజ్ కమిటీ సమావేశం కాలేజ్ అధ్యక్షులు భాను చరణ్ అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు రాజు మాట్లాడుతూ…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో నిధులు అందలేదని విమర్శించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ భారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మోపడం అన్యాయమన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు కాగా, వాటిని విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు చేయడం సరికాదన్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, TC, మెమోలు, ఇతర విద్యా పత్రాలను కళాశాలలు తమ వద్ద ఉంచుకుని విద్యార్థులను, తల్లిదండ్రులను వేధిస్తున్న ఘటనలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల సర్టిఫికెట్లను ఎలాంటి షరతులు లేకుండా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసే విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వం స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు, పెండింగ్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధాన వైఫల్యానికి నిదర్శనమన్నారు, రాష్ట్రంలో ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచాలంటే స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ను ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేసే విధంగా శాశ్వతమైన నిధుల విడుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టి రెండున్నర సంవత్సరాలు కలుస్తున్న ఇప్పటికీ ఒసే ఎత్తడం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి, కళాశాల అనేక సమస్యలు ఉన్నాయి, సమస్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ కార్యదర్శి సుధీర్, కమిటీ సభ్యులు భవన్ భాస్కర్ మణికంఠ శేఖర్ బాబు మోక్షిత్ భాను చంద్రకళ, ఇందుర్తి, తదితరులు పాల్గొన్నారు…*

