ప్రజా సంక్షేమం న్యూస్ / రామన్నపేట:
తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)లో నూతన అధ్యాయం ప్రారంభమైంది.జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన’సంచలనం’వార్తాపత్రిక చీఫ్ ఎడిటర్ బత్తుల గణేష్ ఎంపికయ్యారు. జేఏసీ చైర్మన్ తోగరి కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జేఏసీ చైర్మన్ తోగరి కరుణాకర్‌కు బత్తుల గణేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేస్తూ:
రాష్ట్రంలోని జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ,సంక్షేమం మరియు వారి సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు.యూనియన్లు, సంఘాల సరిహద్దులను దాటి జర్నలిస్టులందరినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు శ్రమిస్తానని స్పష్టం చేశారు.రాష్ట్ర కమిటీ సూచనలతో అన్ని జిల్లాల్లో జేఏసీ కమిటీలను బలోపేతం చేస్తామన్నారు.త్వరలోనే జర్నలిస్టుల సమస్యలపై సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తామని వెల్లడించారు.

