Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణగురుకుల పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం:

గురుకుల పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం:

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయులను సత్కరించిన స్కూల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు
ప్రజా సంక్షేమం న్యూస్ | బీబీనగర్:
బీబీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.ఈ కార్యక్రమానికి స్కూల్ డెవలప్మెంట్ కమిటీ (పేరెంట్స్ కమిటీ) సభ్యులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పేరెంట్స్ కమిటీ సభ్యులు ఉపాధ్యాయులతో కలిసి వివిధ క్రీడల్లో పాల్గొని సందడి చేశారు.అనంతరం విద్యార్థులు,ఉపాధ్యాయులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ,వారిని శాలువాలు,జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.ఉపాధ్యాయుల పట్ల మరియు పాఠశాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పేరెంట్స్ కమిటీ సభ్యులకు పాఠశాల నిర్వహణ వర్గం,ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో విద్యార్థులు,ఉపాధ్యాయులు,పేరెంట్స్ కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.