Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణముదిరాజ్ చైతన్య వేదిక–ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యకమానికి వెళ్ళేనాయకుల ముందస్తు అరెస్టు!

ముదిరాజ్ చైతన్య వేదిక–ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యకమానికి వెళ్ళేనాయకుల ముందస్తు అరెస్టు!

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్-
మర్రిగూడ మండలంలో ముదిరాజుల సమస్యలు తీర్చాలని.అణగారిన కులాలకు అనగారిన ప్రజలకు న్యాయం ఎక్కడిదని .
ముదిరాజ్‌లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ చైతన్య వేదిక–తెలంగాణ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ–ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో,రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కొండల్ ముదిరాజ్ తెలిపారు..ముదిరాజ్‌ల హక్కులు, వాటా, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని తెలిపారు
ప్రధాన డిమాండ్లు:
1. ముదిరాజ్‌లను BC-Aలోకి వెంటనే మార్చాలి.
2. ముదిరాజ్ కార్పొరేషన్‌కు ₹1,000 కోట్లు కేటాయించాలి.
3. చేప పిల్లల పంపిణీలో అవినీతిని అరికట్టాలి.
4. ముదిరాజ్‌లకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.
అరెస్టులు,నిర్బంధాలతో ముదిరాజ్ ఉద్యమాన్ని అణచలేరు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన ముదిరాజ్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో మా పోరాటం కొనసాగుతుంది.అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు!నిర్బంధాలతో ముదిరాజ్ స్వరాన్ని అణచలేరు!హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదు!ముందస్తు అరెస్టు అ ప్రజాస్వామికంమని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.