Friday, September 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ చేసే ఈ ధర్మయుద్ధంలో నిజమే గెలుస్తుంది! ప్రభుత్వ విప్...

ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ చేసే ఈ ధర్మయుద్ధంలో నిజమే గెలుస్తుంది! ప్రభుత్వ విప్ & MLC అద్దంకి దయాకర్

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్
హరీష్ రావు మీ రాజకీయ స్వార్థం కోసం, అబద్ధాల ప్రచారాల కోసం లీగల్ నోటీసులు పంపిస్తే భయపడేది లేదు. నీ లీగల్ నోటీస్‌కు గట్టి కౌంటర్ నోటీస్ ఇస్తున్నాం.నామీద, కాంగ్రెస్ నాయకుల మీద లీగల్ నోటీసులు పంపిన హరీష్ రావు గారికి స్పష్టమైన హెచ్చరిక.పొలిటికల్ బెనిఫిట్ కోసం నీవు ఆడుతున్న నాటకాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది.లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తి లేదు, నీ నోటీస్‌కు త్వరలోనే గట్టి కౌంటర్ నోటీస్ పంపుతున్నాం. నీ నోటీసులకు భయపడి వెనకడుగు వేసే రకం కాదు ఈ అద్దంకి దయాకర్ఇయ్యాల మీడియా ముందు, ప్రజల ముందు పతివ్రతలా నటిస్తే నీ అక్రమాలు దాగిపోవు.మీ మరదలు కవితమ్మ స్వయంగా నీ క్షుద్ర పూజలు గురించి చెప్పింది నిజం కాదా?సొంత ఇంట్లోని వాళ్లే నీపై ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పలేని నీవు, మాపై ప్రగల్భాలు పలుకుతావా?క్షుద్ర పూజలు చేశావో లేదో నేరుగా ప్రజలకు సమాధానం చెప్పు… పారిపోవడం ఎందుకు?నీవు చేసిన పనికి స్పందించకుండా, లీగల్ నోటీసుల వెనుక దాక్కోవడం నీ పిరికిపందతనానికి నిదర్శనం.ఈ మూఢనమ్మకాలను, తాంత్రిక పూజలను ప్రోత్సహిస్తున్నందుకు నిన్ను చట్టపరంగా వదిలేదే లేదు.
అవసరమైతే ఈ అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కి వెళ్తాం:
ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు తలుపు తట్టడానికైనా మేం సిద్ధం.శివమొగ్గలోనూ, తమిళనాడులోని దేవాలయాల పక్కన నీవు చేసిన పూజల చిట్టా మా దగ్గర ఉంది.అఘోరాల లెక్కన, పాతాళ భైరవి పూజల పేరుతో ఆవాహనలు చేసింది నిజం కాదా?ఎయిర్పోర్టుల్లోనూ, మారుపేర్లతో రహస్య ప్రాంతాల్లో నీవు చేసిన క్షుద్ర శకలాలన్నీ త్వరలోనే బయటపెడతాం.పక్కన ఆధ్యాత్మికత పేరు చెప్తూ… వెనుక తాంత్రిక పూజలు చేసే నైజం నీది.శ్రీకాళహస్తి నుంచి కుంభకోణం వరకు ఏ వైపు ఏ పూజలు జరుగుతాయో మాకూ బాగా తెలుసు.ప్రతిపక్ష హోదాలో ఉండి ఇలాంటి మూఢనమ్మకాలను సమాజంలోకి నెట్టడం బాధ్యతారాహిత్యం.నేను మాట్లాడుతున్నది పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే, ఆధారాలు లేకుండా మాట్లాడే అలవాటు నాకు లేదు.ఒక వైపు అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం, సచివాలయానికి ఆయన పేరు అని డ్రామాలు ఆడతారు.మరోవైపు ఇలాంటి క్షుద్ర పూజలకు ఒడిగడుతూ ప్రజాస్వామ్యాన్ని మైళ పరుస్తారు.ఒక్క రోజు కూడా అంబేద్కర్ జయంతికి రాని నీవు, అంబేద్కరిజం గురించి మాట్లాడటం హాస్యాస్పదం.బయటికేమో రాజ్యాంగ వాదులుగా, లోపల మూఢనమ్మకాల ప్రతినిధులుగా నటిస్తున్నారు.సినిమాలో ‘రామన్ – రెమో’ లాగా ఎప్పుడు ఎలా మారతారో మీకే తెలియని పరిస్థితి
దళితులు రోడ్డు మీద తిరిగితే సంప్రోక్షణ చేసేంత కుళ్ళు మీ మనసుల్లో దాగుంది:
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం పడిపోవాలని, వానలు పడకూడదని మీ కోరిక.చివరికి అధికార దాహంతో నీ సొంత మామ కేసీఆర్ చనిపోవాలని కోరుకునే స్థాయికి దిగజారారు.తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజు కూడా సరైన నేపథ్యం లేనివాళ్లు ఇవాళ మా క్యారెక్టర్ డామేజ్ చేయాలని చూస్తున్నారు.వెనుక తలుపు రాజకీయాలు (Backdoor politics) చేసుకుంటూ వచ్చినవాళ్లు మాకు నీతులు చెప్తారా?ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్లను అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేయడం మానుకోండి.తెలంగాణ సచివాలయం అనే ప్రజాస్వామిక కోట చుట్టూ దయ్యాల్లా తిరిగితే ఇక్కడ ఎవరు సహించరు.ఉద్యమ కాలంలో కేసీఆర్ వెంట పండుకున్న రోజుల్లో కూడా దయాకర్ ఉద్యమ వేదికలపై కొట్లాడాడు. ఉద్యమ నేపథ్యం, రాజకీయ కట్టుబాటు అంటే ఏంటో దళితులకు, బీసీలకు, ఎస్టీలకు బాగా తెలుసు.ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి కాంగ్రెస్ భిక్షగా పొంది ఇవాళ అదే కాంగ్రెస్‌ను పతనం చేయాలని చూస్తున్నావు.సోనియా గాంధీ గారి కాళ్ల మీద పడిన రోజులను హరీష్ రావు అంత త్వరగా మర్చిపోయాడా?ఈ దేశం కోసం, రాజ్యాంగం కోసం ఒంటరిగా పోరాడుతున్న రాహుల్ గాంధీ గారితో మిమ్మల్ని పోల్చుకోవద్దు.
నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించిన త్యాగధనుల కుటుంబం కాంగ్రెస్ కుటుంబం:
ప్రజల రక్తం పీల్చే జలగల్లాంటి బిఆర్ఎస్ నాయకులకు, గాంధీ కుటుంబానికి నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది.బిఆర్ఎస్, బిజేపిల రహస్య DNA బంధం 2014 నుంచే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు.పదేళ్లు అధికారంలో లేకపోయినా, పదవులురాకపోయినా సిద్ధాంతం కోసం నిలబడిన సైనికులం మేం.ఉచిత రేషన్ కోటా బియ్యం తిన్నట్టుగా రాజకీయాలను పరిహాసం చేశారు.శాసనసభ, శాసనమండలి సాక్షిగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తాం.మూఢనమ్మకాలతో ప్రజలను మభ్యపెట్టే మీ కుట్రలను ప్రజాక్షేత్రంలో చైతన్యవంతంగా ఎండగడతాం.పోలీసు కేసులు పెట్టిస్తామంటే భయపడేది లేదు… నిన్ను చట్టానికి, ప్రజలకు సమాధానం చెప్పి తీరుతాం.నీ గౌరవం పెంచడానికే ఈ విషయాలను హెచ్చరిస్తున్నాం, ఇంకెప్పుడూ ఇలాంటి క్షుద్ర పూజల జోలికి వెళ్లొద్దు.మీ మధు లాంటి వాళ్లతో బూతులు మాట్లాడిస్తూ రాజకీయ స్థాయిని దిగజార్చకండి.కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందిస్తోంది.హరీష్ రావు! ఇకనైనా నీ అబద్ధాల ప్రచారాలను, చిల్లర నాటకాలను బంద్ చెయ్!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.