TASK–Dell Technologies మధ్య అవగాహన ఒప్పందం.. 5,500 మంది విద్యార్థులకు ప్రయోజనం:
ప్రజా సంక్షేమం న్యూస్-హైదరాబాద్: తెలంగాణలోని యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందించేందుకు TASK (Telangana Academy for Skill and Knowledge),Dell Technologies సంస్థలు అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి.ఈ ఒప్పందం ద్వారా‘uDaan’ కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేయనున్నారు.ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 25 శిక్షణా కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు మూడు నెలలపాటు శిక్షణ అందించనున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),క్లౌడ్ కంప్యూటింగ్,ఎలక్ట్రానిక్స్ తయారీ,ఎమర్జింగ్ టెక్నాలజీస్,డిజిటల్ స్కిల్స్తో పాటు పరిశ్రమల పరిచయం,ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు.తెలంగాణ యువతకు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం పరిశ్రమలు, విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువతకు మెరుగైన అవకాశాలు,ఆధునిక నైపుణ్యాలు అందేలా ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతుందని తెలిపారు.

