Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణసదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ దాడి.. రూ.15 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు పట్టుబాటు

సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ దాడి.. రూ.15 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు పట్టుబాటు

📰 Generate e-Paper Clip

రూ.4.50 లక్షల బిల్లు ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
ప్రజాసంక్షేమం న్యూస్ సదాశివపేట:
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రూ.4.50 లక్షల పనుల బిల్లును ప్రాసెస్ చేసేందుకు రూ.15 వేల లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజినీర్ రాజేష్ కుమార్, ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ శివారెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.గణేష్ నిమజ్జనం సందర్భంగా ఊర చెరువు పూడికతీత పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లు ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఫిర్యాదుదారుడి నుంచి రూ.15 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేసి ఇద్దరు ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరినీ అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భయంగా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుల కోసం 1064 టోల్‌ఫ్రీ నంబర్ లేదా 9440446106 వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.
– ప్రజా సంక్షేమం న్యూస్ రిపోర్టర్ ఎండీ ఖాజా మొయినొద్దీన్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.