హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది.నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా ఎన్నికల సందడి మొదలైంది.
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు!
RELATED ARTICLES

