ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక నంబర్
ప్రజా సంక్షేమం న్యూస్|నల్గొండ:ఎల్‌నినో ప్రభావాన్ని సాకుగా చూపి నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా,కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు.నిత్యావసర సరుకుల ధరల పెంపుపై ఫిర్యాదులు, సంబంధిత సమాచారాన్ని 9281423653 నంబర్‌కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ధరల నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు:కలెక్టర్ బి.చంద్రశేఖర్
RELATED ARTICLES

