హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్:
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్‌ను ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ పెద్దపల్లి జిల్లా మహిళా కన్వీనర్ ఎం. అనితా శ్రీ హైదరాబాద్‌లోని సమాచార హక్కు భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.అనంతరం రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం (RTI) అమలు తీరు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంపై కమిషనర్‌తో చర్చించారు.ముఖ్యంగా ఆర్టీఐ విచారణలకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు (PIOలు) సక్రమంగా హాజరుకాకపోవడంతో దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్దేశపూర్వకంగా సమాచారం అందించడంలో జాప్యం చేసే అధికారులపై చట్ట నిబంధనల ప్రకారం జరిమానాలు విధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరే దరఖాస్తుదారులు, ఆర్టీఐ కార్యకర్తల పట్ల కొందరు అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీఐ కార్యకర్తలకు తగిన రక్షణ కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సమాచార హక్కు చట్టంపైవిస్తృత అవగాహన కల్పించాలని కోరారు.ఈ అంశాలపై కమిషనర్ దేశాల భూపాల్ సానుకూలంగా స్పందించి, సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అనితా శ్రీ తెలిపారు.ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ చట్టం పటిష్టంగా అమలయ్యే వరకు ఆర్టీఐ కార్యకర్తలు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని ఆమె స్పష్టం చేశారు.
సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ మహిళా కన్వీనర్ అనితా శ్రీ
RELATED ARTICLES

